17న వామపక్షాల సదస్సు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: మతోన్మాదం, విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 17వ తేదీన జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. నగరంలోని ఎన్ఆర్ భవన్ లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోందని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తోందని ఆరోపించారు. ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, ఉన్న ఉద్యోగాలను ఊడ...