జంతు శాస్త్ర ప్రభుత్వ అధ్యాపకుడు మృతి పట్ల సంతాపం
కోటగిరి, బతుకమ్మ : కోటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో జంతుశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్న గోవర్ధనగిరి కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఆయన మృతి పట్ల జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్, జిల్లా ప్రిన్సిపాల్ సంఘం ఉపాధ్యక్షులు గంధం బుద్ధిరాజ్, ప్రభుత్వ అధ్యాపకుల సంఘం (రిజిస్టర్ నంబరు711 సంఘం) జిల్లా అధ్యక్షులు బండారి భాస్కర్, మరో అధ్యాపకుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మి నారాయణ, కోటగిరి అధ్యాపకులు తీవ్ర సంతాపం ప్రకటించారు. అయన మృతి పట్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.