Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 April 2026, 5:08 pm Posted by : ramakrishna

సెలవుల్లో యోగాను నేర్చుకోవాలి

 

. . . భారత స్వాభిమాన్ ట్రస్టు యోగా శిబిరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రతి విద్యార్థి వేసవి సెలవులను వృధా చేయకుండా యోగాను నేర్చుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నగరంలోని హరిచరణ్ పాఠశాలలో ఉచిత ధ్యాన, యోగా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..యోగా చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు.

 

Learn yoga during vacations

 

ధ్యానం, సూర్య నమస్కారం నిత్య జీవనంలో భాగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత జీవన విధానంలో ఒత్తిడిను దూరం చేసుకునేందుకు యోగా సాధన ఎంతగానో దోహదపడుతుందన్నారు. అంతకుముందు స్వామి డా.పరమార్థ దేవ్ యోగాలో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ అధ్యక్షుడు సాయన్న, పతంజలి యోగ సమితి అధ్యక్షులు బుచ్చన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇంజనీర్ గంగాధర్, యోగరత్న ప్రభాకర్, పతంజలి యోగ రాష్ట్ర అధ్యక్షుడు శివుడు, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

Learn yoga during vacations