డిప్లొమా కోర్సును చక్కగా నేర్చుకుని రైతులకు సహాయకారిగా నిలువాలి
. . . ఇన్ పుట్ డీలర్ల శిక్షణ తరగతులను ప్రారంభించిన కలెక్టర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్ (DAESI)” కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇన్ పుట్ డీలర్లకు సూచించారు. తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవడంతో పాటు రైతాంగానికి సరైన విధంగా తోడ్పాటును అందించగల్గుతారని అన్నారు....