మల్లికార్జున ఖర్గేను పరామర్శించిన నాయకులు

ఢిల్లీ, బతుకమ్మ: ఇటీవల అనారోగ్యానికి గురై పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ చికిత్స చేయించుకుని, ఢిల్లీలోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఈరవత్రి అనిల్  సోమవారం పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకుని, తిరిగి ప్రజా జీవితంలో క్రియాశీలకంగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరారు.