Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 7:53 pm Posted by : ramakrishna

ప్రజల సమస్యలపై నాయకులను నిలదీయాలి

 

. . . బాన్సువాడలో బీజేపీ ప్రశిక్షణ శిబిరం లో నీలం చిన్న రాజులు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలపై అధికారులను, అధికార పార్టీ నాయకులను నిలదీయాలని జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అన్నారు. బాన్సువాడ పట్టణంలోని జిఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో నీలం చిన్న రాజులు ఆధ్వర్యంలో మంగళవారం ప్రశిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరం రెండు రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణ శిబిరంలో కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త బార్డర్ లో ఉన్న సైనికుల లాగా, వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పనిచేయాలని అన్నారు. బిజెపి పై ప్రజలు విశ్వాసం వచ్చే విధంగా ఉద్యమాలు చేయాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిసే విధంగా గడపగడపకు వెళ్లి ప్రచారం చేయాలని తెలిపారు. ప్రశిక్షణ శిబిరం రెండో రోజు జరిగే ముగింపు సమావేశానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, అరుణతార, మురళీధరన్ గౌడ్, రంజిత్, మోహన్, బాణాల లక్ష్మారెడ్డి, మధుసూదన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 

Leaders should be held accountable for people's problems.