Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2024, 6:08 pm Posted by : ramakrishna

ఐటి హబ్ లో 19 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు

తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ కలెక్టర్ ను కలిసిన ఉద్యోగులు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : గత ప్రభుత్వ హయాంలో నిజాంబాద్ జిల్లా కేంద్రంలోని ఐటీ హబ్ లో శ్రీ మిత్ర ఏజెన్సీ ద్వారా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా వివిధ పనుల్లో ఉద్యోగం చేస్తూ వస్తున్నామని కానీ ఇప్పుడు వచ్చిన నూతన ఏజెన్సీ తమను అకారణంగా విధుల్లో నుంచి తొలగించి తమను రోడ్డు పాలు చేస్తున్నారని హౌసింగ్ ఉద్యోగులు నాయకులు పెద్దోళ్ల ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోకి తీసుకొని తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుని వారు కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఐటీ హాల్లో 19మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా నలుగురు సెక్యూరిటీ గార్డు లుగా, 1గార్డెనర్ గా,1 ప్లంబర్ గా,1 ఎలక్ట్రిషన్,1 వాష్ రూమ్ క్లీనర్, పదిమంది హౌస్ కీపింగ్ మిత్రులందరికీ ఐటీ హబ్ లో ఉద్యోగం చేస్తూ తమ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నామని, ఈ సంవత్సరం ఖమ్మం నుండి నూతనంగా వచ్చిన ఏజెన్సీ తమను అకారణంగా తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టర్కు తమ సమస్యను విన్నవించారు. ఈ విషయంలో కలెక్టర్ తర్వాత చూయించి తమకు తిరిగి తమ ఉద్యోగాలను ఇప్పించాలని వారు కోరారు.