Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2024, 11:37 am Posted by : ramakrishna

జ్యుడీషియల్ అధికారుల క్వార్టర్స్ నిర్మాణం కు శంకుస్థాపన

. . .పర్చువల్ మోడ్ లో ప్రారంభించిన హైకోర్టు జడ్జిలు

. . . భూమి పూజ చేసిన జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల

నిజామాబాద్ సిటీ, బతకమ్మ :                                                              

నిజామాబాద్ నగరంలోని కోర్టు సముదాయం ప్రాంగణంలో జిల్లా న్యాయశాఖ అధికారుల కొరకు నిర్మించనున్న క్వార్టర్స్ లను హైకోర్టు జడ్జీలు సురేందర్, వినోద్ కుమార్, లక్ష్మీనారాయణలు పర్చువల్ పద్ధతిలో  ప్రారంభించారు.

 

Laying of foundation stone for the construction of judicial officers' quarters అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో గల క్వార్టర్స్ యొక్క  భూమిలో సోమవారం ఉదయం జిల్లా జడ్జ్ సునీత కుంచాల భూమి పూజ చేసి లాంచనంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ టు పాటు బోధన్ కోర్టులలో విధులు నిర్వహించే న్యాయధికారుల కొరకు నిజామాబాద్ లో ఆరు, బోధన్ లో నాలుగు క్వార్టర్స్ లను నిర్మాణం జరగనుందని  అన్నారు. ఈ క్వార్టర్స్ లో న్యాయాధికారులకు అన్ని వసతులతో కూడిన నిర్మాణం జరగనున్నట్లుఆమె వెల్లడించారు. వీలైనంత త్వరగా కాంట్రాక్టర్ ఇళ్ల సముదాయాలను పూర్తిచేసి న్యా అప్పజెప్పాలని ఆమె కాంట్రాక్టర్ ను కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయధికారులతోపాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడుజగన్మోహన్ గౌడ్, న్యాయవాదులు ఆశ నారాయణ, రాజ్ కుమార్ సుబేదార్ తోపాటు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Laying of foundation stone for the construction of judicial officers' quarters