మధ్యవర్తిత్వ శిక్షణ పూర్తి చేసిన న్యాయవాదులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జక్కుల శ్రీధర్, న్యాయవాదులు సుమలత, ధర్మయ్య లు నిర్మల్ జిల్లాకోర్టు ప్రాంగణంలోని సమావేశపు హల్ ఐదు రోజుల మధ్యవర్తిత్వపు శిక్షణను పూర్తి చేశారు. ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్, న్యాయసేవ అధికార సంస్థ రాష్ట్ర మెంబర్ సెక్రటరీ పంచాంక్షరీ న్యాయ వివాదాలను మధ్యవర్తిత్వపు చట్టం ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశాలను తెలిపారు. చివరి రోజైన గురువారం నిర్మల్...