Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 5:02 pm Posted by : ramakrishna

న్యాయవాదులు వృత్తి తో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి

 

. . . ప్రధాన జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి జె.వి.ఎన్. భారత లక్ష్మి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

న్యాయవాదులు తమ వృత్తి తో పాటు ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాన జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి జె.వి.ఎన్. భారత లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి 250 మందికి పైగా బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు హాజరై ఉచిత వైద్య సేవలను పొందారు. ఈ సందర్భంగా ప్రధాన జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి మాట్లాడుతూ ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి న్యాయవాదులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు నీలకంఠ రావు మాట్లాడుతూ, బార్ సభ్యుల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మెడికవర్ హాస్పిటల్స్ ఈ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు.

 

Lawyers should safeguard their health alongside their profession.

 

పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్, బార్ అసోసియేషన్ సెక్రెటరీ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు అందించడం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడిందన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ అందిస్తున్న నిపుణుల వైద్య సేవలను ఆయన ప్రశంసించారు. ఈ శిబిరంలో కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, నెప్రాలజి ,ఆర్థోపెడిక్స్, పల్మనాలజీ, గైనకాలజీ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ శిబిరానికి 200 మందికి పైగా హాజరై ఉచిత వైద్య సేవలు పొందారు. అలాగే రక్తపోటు, షుగర్, ఈసీజీ, 2 డి ఎకో, హెచ్ బి 1 సి, సి.బి.పి, ఎల్ ఎఫ్ టి, సీరం క్రియాటిన్ క్రియాటిన్ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ కె. స్వామి, డీఎంఎస్ డా. యజ్ఞ, ఆసుపత్రి వైద్యులు, మార్కెటింగ్ బృందం, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. చివరగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

 

Lawyers should safeguard their health alongside their profession.