Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 12:27 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డి కోర్టులో న్యాయవాదుల నిరసన

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు పరిధిలో న్యాయవాదులు మంగళవారం సమావేశమయ్యారు. ఈమేరకు  సోమవారం సుప్రీం కోర్టులో చోటు చేసుకున్న ఘటనపై వారు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ రావు, న్యాయవాదులు పద్మ పండరి, సతీష్, నామ శ్రీకాంత్, నాగం సాయిబాబా, నామ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.  న్యాయ వ్యవస్థ స్వతంత్రతకు భంగం కలిగించే చర్యలను ఏ మాత్రం సహించబోమని న్యాయవాదులు  ప్రకటించారు. న్యాయవాదుల హక్కులు, న్యాయస్థానాల గౌరవం కాపాడటంలో బార్ అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.