Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 4:32 pm Posted by : ramakrishna

న్యాయవాది జ్యూడిషియల్ కష్టడిపై న్యాయవాదుల నిరసన

 

. . . యువ న్యాయవాదిని ఇరవై నాలుగు గంటలు అదుపులో ఉంచుకోవాలన్న ఏపీ హైకోర్టు జడ్జి రాజశేఖర్ రావు

 

. . . బగ్గుమన్న బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా

 

. . . భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ

 

. . . నేడు దేశవ్యాప్త నిరసనలకు పిలుపు

 

. . . కోర్టులలో విధులు బహిష్కరించిన న్యాయవాదులు

 

. . . నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావు వెల్లడి

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక యువ న్యాయవాదిని ఇరవై నాలుగు గంటలపాటు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచాలని ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లడ రాజశేఖర్ రావు తీరును నిరసిస్తూ నిజామాబాద్ బార్ అసోసియేషన్ నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు బార్ అధ్యక్షుడు నీలకంఠ రావు తెలిపారు. బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా ఆదేశాల మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలోని బార్ సమావేశపు హల్ లో అత్యవసర సమావేశం నిర్వహించి న్యాయవాదుల ఏకాభిప్రాయం మేరకు కోర్టుల విధులను బహిష్కరించి నిరసన తెలిపినట్లు ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జస్టిస్ రాజశేఖర్ బెంచ్ ముందు కక్షిదారు తరపున వాదనలు వినిపించబోయిన యువ న్యాయవాది హైకోర్టు రిజిస్ట్రార్ ముందు హాజరై ఉండాలని ఆదేశించడం న్యాయవాదుల హక్కులను కాలరాచివేయడమేనని ఆయన అన్నారు. కక్షిదారుల ప్రయోజనాల మేరకే న్యాయవాదులు కోర్టు హల్ లో న్యాయమూర్థుల ముందు తమ వాదనలను వినిపిస్తారని వివరించారు.

 

Lawyers protest against judicial hardship

 

యువ న్యాయవాదులకు న్యాయమూర్థులు విజ్ఞాన కరదీపికలుగా ఉండాలే కానీ కఠినంగా ఉండరాదని పేర్కొన్నారు. బార్ అండ్ బెంచ్ సుహృధ్భావ సంబందాలనే కోరుకుంటామని ఘర్షణ బార్ సిద్దాంతం కానేకాదని నీలకంఠ రావు అన్నారు. న్యాయవ్యవస్థ ఒక కుటుంబమని చిన్న చిన్న పొరపాట్లు వచ్చినప్పుడు సర్దుకొని పోవాలే కాని నలుగురిలో నగుబాటు కావద్దనే బార్ లక్ష్యమని అన్నారు. బార్ ప్రధాన కార్యదర్శి నల్ల సుభాష్ రెడ్డి మాట్లాడుతూ బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా పిలుపు మేరకు నిరసనను తెలియజేశామని తెలిపారు. జిల్లాకోర్టు ప్రధాన ద్వారం ముందు నిలబడి నినాదాలతో జస్టిస్ రాజశేఖర్ వెలువరించిన ఉత్తర్వులు చట్టసమ్మతం కావని తెలిపామని అన్నారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు మంతెన రాజేందర్ రెడ్డి, ఎర్రం గణపతి, వి. భాస్కర్, నరేందర్ రెడ్డి, పరుచూరి శ్రీధర్, విగ్నేష్, రవీందర్, మాణిక్ రాజు, భాగి చరణ్ తదితరులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారని తెలిపారు. న్యాయవాదుల ఏకాభిప్రాయమే రక్షణ కోటగా నిలుస్తుందని చాటి చెప్పామని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బార్ కోశాధికారి మధుసుధన్ గౌడ్, క్రీడల కార్యదర్శి బైర గణేష్, మానస, న్యాయవాదులు మధుసుధన్ రావు, మెట్టు నరేష్ కుమార్, పడిగల వెంకటేశ్వర్, తోట శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, యెండల ప్రదీప్, చిన్య నాయక్, మద్దేపల్లి శంకర్, బిట్ల రవి, జీషాన్, అన్సారి, కవిత తుకారామ్, లిల్లీ తదితరులు పాల్గొన్నారు.