జిల్లా జడ్జిని సన్మానించిన న్యాయవాదులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా కుంచాల పెద్దపల్లి జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా జిల్లా న్యాయాధికార సేవా సంస్థ సమావేశం హాల్లో న్యాయవాదులు శాలువాలు కప్పి నెమెంటులు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల్లో జిల్లా ప్రజలతో మమేకమై న్యాయ సేవలు అందించడం అభినందనీయమని రాబోయే రోజుల్లో ప్రజలకు సత్వర న్యాయం అందించిన కృషి చేయాలని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత...