డీడీఓపి రజనీ ని సన్మానించిన న్యాయవాదులు
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కోర్టు డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ (డీడీఓపీ)గా ఎం. రజనీ ఇటీవల నియమితులై బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు భవనంలోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, న్యాయవాదుల పరస్పర సహకారంతో కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. న్యాయవాదులు, ప్రాసిక్యూషన్ విభాగం మధ్య సమన్వయం పెంపొందించడం...