నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కుకట్‌పల్లి బార్ అసోసియేషన్ అడ్వకేట్ తన్నేరు శ్రీకాంత్ తన కోర్టు విధి నిర్వహణ అమలు చేస్తూ ఉండగా జరిగిన క్రూర దాడిని న్యాయవాది పరిషత్ నిజామాబాద్ శాఖ తీవ్రంగా ఖండిస్తోందని న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. న్యాయవాదిపై దాడి జరగడం అనేది న్యాయవ్యవస్థ గౌరవాన్ని, కోర్టుల అధికారం పట్ల చేసిన దారుణమైన సవాలుగా భావిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల పై దాడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుందని దాడికి బాధ్యులైన వారిని తక్షణమే అరెస్టు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ చట్టంను తక్షణం అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.