నిజామాబాద్, బతుకమ్మ : ఇటీవల జరిగిన హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మంగళవారం వెలువడిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టించడం జరిగింది. బిజెపి విజయం పట్ల న్యాయవాదులు నిజామాబాద్ జిల్లా కోర్టు ఎదుట టపాకాయలు కాల్చి , స్వీట్లు పంచి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాలు విజయ డంబికా ముగిస్తుందని, హర్యానాలో గత పది సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి పట్ల ప్రజలు విశ్వాసనీయతతో, అభివృద్ధి పట్ల ఆకాంక్షతో, దేశ భద్రత, దేశ సమగ్రత కై అభివృద్ధికి పట్టం కట్టారని తెలిపారు. అందరి అంచనాలకు మించి భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగిందని తెలియజేశారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలను తలకిందులు చేస్తూ అక్కడి ప్రజలు బిజెపి ప్రభుత్వానికి పట్టడం పట్ల సంతోషాన్ని తెలియజేశారు. బిజెపి నీ గెలిపించిన హర్యానా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి లీగల్ సెల్ కార్యదర్శి బిట్ల రవి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శ్రీకాంత్, వసంతరావు రాజు ,మాణిక్ రాజు,చిన్న నాయక్ , వెంకటేష్ , అరేటి నారాయణ, శ్రీమాన్ ,రవి తదితర న్యాయవాదులు ఈ సంబరాలో పాల్గొన్నారు.
