అమ్మనాన్న చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరపత్రాల ఆవిష్కరణ

రుద్రూర్, బతుకమ్మ : రాబోయే పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించే సర్పంచులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి వాటిని పరిష్కరించాలని కోరుతూ ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలో అమ్మానాన్న చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్బంగా ట్రస్ట్ నిర్వాహకులు శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సర్పంచ్ పదవి కాదని సామాజిక బాధ్యత అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తోట శంకర్, మాజీ వార్డు సభ్యులు మేక వెంకటేశ్వరరావు, కొప్పర్గ...