Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 April 2025, 7:42 pm Posted by : ramakrishna

కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల ప్రారంభం

ఎల్లారెడ్డి, బతుకమ్మ: న్యాయ సేవా ప్రాధికార సంస్థ – న్యూఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా సంస్థ – హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ఎల్లారెడ్డి న్యాయశాఖ పరిధిలోని ఎల్లారెడ్డి, గాంధారి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్ మండలాల్లో కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లు స్థాపించబడ్డాయి. ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ప్రారంభ కార్యక్రమంలో, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ మహేష్, ఎల్లారెడ్డి ఎస్‌ఐ బొజ్జ మహేష్, ముఖ్య అతిథులుగా పాల్గొని సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు సిబ్బంది, కమ్యూనిటీ మీడియేషన్ వాలంటీర్లు కే. శ్రీనివాసాచారి, గుడిపల్లి ప్రతాప్ రెడ్డి, జె.సంగప్ప పాల్గొన్నారు.

Launch of Community Mediation Centers