Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 6:39 pm Posted by : ramakrishna

లాఠీలు, టియర్ గ్యాస్ లు ప్రశ్నలకు సమాధానాలు కావు

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీలతో, టియర్ గ్యాస్ లతో దాడులు చేయించడం అత్యంత అప్రజాస్వామికని చర్యలని భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ నిజామాబాద్ జిల్లా కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ పరిధిలోని అత్యున్నత స్థాయిలో నిర్వహించే పరీక్షలలో లీకేజీలను అరికట్టలేని అధికారులు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమ బాధ్యతలను మరిచిపోయి అప్రధానంగా ఉండటమే వింతల్లోకెళ్ళ వింత అని మధుసుధన్ ఏద్దెవ చేశారు. ప్రశ్నించే హక్కులు రాజ్యాంగం కల్పించిందని ఆ హక్కులను అణచివేయలేరని పేర్కొన్నారు. విద్యార్థులపై లాఠీచార్జీలను, టియర్ గ్యాస్ లను ప్రయోగించడం ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యావ్యవస్థలో లీకేజీలు లేని, పారదర్శక పరీక్షల విధానాన్నే విద్యార్థులు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. వ్యవస్థలో జవాబుదారితనం కోసం కొట్లాడుతున్న విద్యార్థులకు సంఘీభావం తెలుపుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.