లష్కరు బోనాలు షూరూ…
హైదరాబాద్, బతుకమ్మ : గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రోచ్ఛారణల మధ్య మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు శ్రీ జగదాంబిక అమ్మవారికి పట్టువస్త్రాలు, మొదటి బంగారు బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా...