Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 6:33 pm Posted by : ramakrishna

రైలులో భారీగా గంజాయి స్వాధీనం

 

. . . నిందితుల కోసం గాలింపు

 

​కామారెడ్డి, బతుకమ్మ :

 

నాగవల్లి ఎక్స్‌ ప్రెస్ రైలులో అక్రమంగా రవాణా చేస్తున్న 6 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్, రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, కామారెడ్డి జిల్లా మధ్యనిషేధ అధికారి ముకుందరెడ్డి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. ​పక్కా సమాచారంతో కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, జిల్లా టాస్క్‌ ఫోర్స్, రైల్వే పోలీసులతో కలిసి సంయుక్తంగా సంబల్‌పూర్ నుండి నాందేడ్ వెళ్లే నాగవల్లి ఎక్స్‌ ప్రెస్‌లో దాడి చేశారు. ఈ దాడుల్లో 6 కిలోల ఎండు గంజాయి దొరికినప్పటికీ, నిందితులు ఎవరూ పట్టుబడలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. ​ఈ తనిఖీల్లో కామారెడ్డి ఎక్సైజ్ సీఐ సంపత్ కృష్ణ, డీటీఎఫ్ సీఐ సుందర్‌కృష్ణసింగ్, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, ట్రైనీ ఎస్ఐలు అనిల్, మధులతో పాటు సిబ్బంది జాన్, ఫరీద్, శ్రీనివాసరావు, శరత్ కుమార్, అమృత్‌రెడ్డి, శంకర్, పవన్, నర్సింలు, శరత్, దినేష్, రాజు పాల్గొన్నారు.