జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరు ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈవిషయాన్ని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2023 ఎన్నికల్లోను దీపక్ రెడ్డి జూబ్లిహిల్స్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. నవంబర్ 11 న పోలింగ్ జరగనుంది. 14 న లెక్కింపు చేపట్టనున్నారు.