ఎస్సీ కార్పొరేషన్ లోన్ పేరుతో భూమి రిజిస్ట్రేషన్ మోసం..?
. . . జిల్లా అధికారులకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన చెవుల శ్యామయ్య కుటుంబానికి చెందిన భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తామని నమ్మించి భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. బాధితుడు చెవుల శ్యామయ్య తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నెంబర్ 711/1లో ఉన్న 14 గుంటల భూమి, సర్వే నెంబర్ 713/1లో ఉన్న 23...