భూభారతి పనులను వేగవంతం చేయాలి
నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలి ఆర్డీవో రాజేందర్ ఇందల్వాయి, బతుకమ్మ : మండల కేంద్రంలోని తాహసిల్దార్ కార్యాలయాన్ని ఆర్డిఓ రాజేందర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సంస్థ గురించి తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు.భూభారతి లో వచ్చిన దరఖాస్తులను త్వరితిగతిన ఆన్లైన్ చేయాలని ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలన్నారు. మండల పరిధిలో భూభారతి కార్యక్రమం అమల్లో ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తాహసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ నిర్వహించినట్లు ఆయన తెలిపారు....