భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు   నిజామాబాద్, బతుకమ్మ : భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మంగళవారం ముప్కాల్ మండల కేంద్రంలో  నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం 14 ఏప్రిల్ 2025న ప్రారంభించడం జరిగిందని తెలిపారు. చట్టం పై ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి (భూమి హక్కుల...