Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2025, 6:10 pm Posted by : ramakrishna

కూకట్ పల్లి లో భూములు అమ్ముడే కాదు. . . ఇక్కడ అభివృద్ధిపై కాంగ్రెస్ శ్రద్ధ పెట్టాలి

 

. . . ప్రజా సమస్యల పై యుద్ధ భేరియే మా జాగృతి చేస్తోంది

. . . జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైద్రాబాద్, బతుకమ్మ :

హైదరాబాద్ కు కూకట్ పల్లి కామధేనువుగా మారింది. ఇక్కడ 2 వేల కోట్ల రూపాయల విలువైన భూములను ప్రభుత్వం అమ్మింది. కూకట్ పల్లి లో భూములు అమ్ముడే కాదు,ఇక్కడ అభివృద్ధిపై కాంగ్రెస్ శ్రద్ధ పెట్టాలి అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మేడ్చల్ జిల్లా లో జనం బాటలో భాగంగా కూకటల్ పల్లి నియోజకవర్గంలో కల్వకుంట్ల కవిత పర్యనట కొనసాగుతూ ఉంది. సోమవారం వై జంక్షన్ లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం కవిత మాట్లాడుతూ… కోట్ల రూపాయాల భూములు అమ్ముకున్న కానీ కూకట్ పల్లి నియోజకవర్గం కోసం కనీసం రూపాయి కూడా ఖర్చు చేయలేదు. గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని ఇప్పుడు గొప్పగా పెడుతున్నారు కానీ కూకట్ పల్లిలో కనీస వసతులు లేవు. ఇక్కడ ఒక్క స్టేడియం కూడా లేదు అని తెలిపారు. అసలు హైదరాబాద్ ను గ్లోబల్ సిటి అని ఎలా చెబుతున్నారు? జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉందన్నారు.  కూకట్ పల్లి అంటే ఒక మిని ఇండియా మాదిరిగా ఉంది. కానీ ఇక్కడ పేదవాళ్లు రెంట్ కు ఇళ్లు తీసుకునే పరిస్థితి కూడా లేదు అన్నారు. కనీసం ప్రభుత్వాన్ని అడిగే వాళ్లు లేకుండా పోయారు. ఓట్లు ఉన్నప్పుడు మాత్రమే వచ్చి ఓట్లు అడుగుతున్నారు.  ఓట్లు లేనప్పుడు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవటం లేదు అని అవేధన వ్యక్తం చేశారు. పాలక పక్షం పట్టించుకోవటం లేదు. ప్రతిపక్షం అడగటం లేదు. అందుకే జాగృతి బాధ్యతను భుజాన వేసుకొని ప్రశ్నిస్తోందని తెలిపారు.

Land in Kukatpally is not for sale... Congress should focus on development here

.