Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 11:33 am Posted by : ramakrishna

వనస్థలిపురం కమ్మగూడలో భూ వివాదం

పరస్పరం దాడులు చేసుకున్న ఇరువర్గాలు

బస్సుల అద్దాలు ధ్వంసం, పలు బైకులకు నిప్పు పెట్టిన ఫ్లాట్ ఓనర్లు

వెబ్ న్యూస్, బతుకమ్మ : వనస్థలిపురం కమ్మగూడలో భూ వివాదంలో ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. తీవ్ర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బస్సుల అద్దాలు ధ్వంసం, పలు బైకులకు ఫ్లాట్ ఓనర్లు నిప్పు పెట్టారు. కమ్మగూడ సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంలో వివాదం నెలకొంది. గత 20 సంవత్సరాల క్రితం కొన్న ప్లాట్స్, ఇల్లు నిర్మించుకుని ఉంటున్న ప్రాంతం మాదంటూ భూకబ్జాదారులు వచ్చి గత కొద్ది రోజులుగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ప్లాట్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం మెహదీపట్నం నుంచి మహిళలను బస్సులలో తెచ్చి బెదిరించడానికి పాల్పడుతుండగా ప్లాట్ల యజమానులు అడ్డుకున్నారు. ప్లాట్ల యజమానులు కబ్జాదారులను తరిమి వేసి వారికి చెందిన బైకులు తగలబెట్టి, మహిళలు వచ్చిన బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Land dispute in Vanasthalipuram Kammaguda

Land dispute in Vanasthalipuram Kammaguda