Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 September 2025, 6:00 pm Posted by : ramakrishna

బోధన్‌లో భూమి వివాదం.. బాధితుల ఆవేదన

బతుకమ్మ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని న్యూ బస్టాండ్ ఆవరణలోని సర్వే నంబర్ 271/ఏలో గల 22 గుంటల భూమిపై వివాదం నెలకొంది. ఈ భూమి తమ తాతకి చెందినదేనని, దానిని అక్రమంగా ఆక్రమించారని బాధితులు ఆరోపించారు.  ఈ నేపథ్యంలో కీర్తిశేషులు రామా గౌడ్ కుమారులు కే. శ్రీధర్ గౌడ్, కే. ఈశ్వర్ గౌడ్లు బోధన్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ తాత భూమిని బోధన్ వాసులైన సిహెచ్. శంకర్ గౌడ్, లచ్చ గౌడ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారుల సహకారంతో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అనంతరం శంకర్ గౌడ్ తన కుమారుడు సిహెచ్. లోకేష్ గౌడ్కు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. తమ ఫిర్యాదుతో స్పందించిన తాసిల్దార్, ఆర్‌డీఓ సూచనల మేరకు మున్సిపల్ అధికారులు వచ్చి అక్రమ నిర్మాణాలను నిలిపివేశారని తెలిపారు. అలాగే సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో కేసు ఇంటికే తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఈ వివాదంపై న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, అధికారులను మీడియా ద్వారా వేడుకుంటున్నట్లు వారు తెలిపారు.