భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆర్.ఐలు, సర్వేయర్లతో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ డిచ్పల్లి నుండి వీ.సీలో పాల్గొన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో మండలం వారీగా తహసిల్దార్, ఇతర సిబ్బందితో సమీక్ష...