Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 July 2025, 8:39 pm Posted by : ramakrishna

లంబాడ హక్కుల పోరాట సమితి ఎస్ఎస్ నగర్ మండల కమిటీ ఎన్నిక

కామారెడ్డి, బతుకమ్మ : లంబాడ హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తేజావత్ బెల్లయ్య ఆదేశాలకు మేరకు  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్, రాష్ట్ర కార్యదర్శి  వినోద్ నాయక్  ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఎస్ ఎస్ నగర్ మండల కమిటీగా లంబాడ హక్కుల పోరాట సమితి  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మాలోత్ పీర్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా అనిల్ కుమార్ నాయక్ ను కామారెడ్డి జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు నునావత్ గణేష్ నాయక్, బద్రి నాయక్ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ , గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్ , జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు  ప్రకాష్ నాయక్, ఎల్లారెడ్డి నియోజకవర్గ బాధ్యులు బానోత్ మదన్లాల్ ,కామరెడ్డి టౌన్ అధ్యక్షులు  మోహన్ నాయక్ ,  రవీందర్ నాయక్, విజయ్ నాయక్ ఎస్,ఎస్ న,గర్ మండలం నుండి 100 ఎల్ ,హెచ్, పి ,ఎస్ కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు.