బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రభుత్వ న్యాయవాదిగా లక్ష్మీనారాయణమూర్తి గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రభుత్వ న్యాయవాదిగా నియామకానికి కృషి చేసిన వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు లక్ష్మీనారాయణ మూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు…