బడిని బతికించిన లక్ష్మణ్ సార్

మోర్తాడ్, బతుకమ్మ: ముగ్గురు విద్యార్థులు ఉన్న పాఠశాల మూతపడుతుంది అనుకున్న సమయంలో ఆపద్బాంధవుడిలా వచ్చి ముగ్గురిని ఉన్న విద్యార్థుల సంఖ్యను 17 మంది విద్యార్థులకు పెంచి ప్రభుత్వ బడిని బతికించాడని మోర్తాడ్ విద్యాధికారి సమ్మిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. గత సంవత్సరం ఉపాధ్యాయుల బదిలీ విషయములో మోర్తాడ్ మండలంలోని శెట్పల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో విద్య బోధించడానికి వచ్చారు. కేవలం ముగ్గురు విద్యార్థులే ఉండడంతో కొంత ఇబ్బందికి గురైనప్పటికీ ముగ్గురు విద్యార్థులను అన్ని విషయాలలో అన్ని సబ్జెక్టులలో...