లక్ష్మి నారాయణ ఆలయంలో లక్ష తులసి అర్చన 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :  మండలంలోని చౌట్ పల్లి శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో మంగళవారం లక్ష తులసి దళలతో విశేష అర్చన నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే ఉత్తాన ఏకాదశి పురస్కరించుకొని ఆలయ అర్చకులు సముద్రాల అమర్నాథా చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు చేసారు. వేద పండితుడు రాష్ట్ర అవార్డు గ్రహీత గురుమంచి చంద్ర శేఖర్ శర్మ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నారాయణుల ఉత్సవమూర్తులకు వేదక్తంగా పంచామృత అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయం లోని మూల విరాట్టులకు విష్ణు సహస్ర నామాలతో లక్ష తులసిదళ అర్చన...