భారీ బందోబస్తు మధ్య కొనసాగిన చెరువు బౌండరీ పనులు..
. . . రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు హాజరు . . . భారీగా తరలివచ్చిన గ్రామస్తులు ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని పెద్ద చెరువు భూములు కొందరు భూకబ్జాదారుల చెరలో చిక్కుకుని క్రమంగా కుచించుకుపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు శిఖం భూములను కాపాడాలని కోరుతూ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ నూకని గంగామణి గంగారం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ఇరిగేషన్ అధికారులకు పలుమార్లు...