Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2025, 7:31 pm Posted by : ramakrishna

రూ.1,51,000 పలికిన లడ్డు

బతుకమ్మ, జుక్కల్ : మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలోని మున్నూరు కాపు గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డు రూ.151000/- పలికినట్లు మండప నిర్వహకులు మున్నూరు కాపు కుల సభ్యులు  ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం గణేష్ నిమజ్జనం వేడుకల్లో భాగంగా మున్నూరు కాపు గణేష్ మండపంలో ప్రతిష్టించిన గణేశుని విగ్రహం వద్ద ఉన్న లడ్డుకు వేలంపాట నిర్వహించారు. పోటా పోటీగా వేలంపాటలో పాల్గొన్న భక్తులు చివరకు రూ.1,51,000 రూపాయలకు పెద్ద ఏడిగి గ్రామానికి చెందిన సుంకరివార్ అశోక్  లడ్డును దక్కించుకోగా, రెండవ (చిన్న) లడ్డును అపాసివార్ గంగారం రూ. 0 వేలకు కైవసం చేసుకున్నట్లు మున్నూరు కాపు గణేష్ మండలి నిర్వాహకులు పేర్కొన్నారు.