పర్యవేక్షణ లోపం.. కలుషితం అవుతున్న తాగు నీరు

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న అధికారులు   రుద్రూర్, బతుకమ్మ : ప్రజలకు రక్షిత నీటిని అందించే లక్ష్యంతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన పథకాలు గాడి తప్పుతున్నాయి. ఆరోగ్యకరమైన తాగునీటిని అందించాల్సింది పోయి అపరిశుభ్ర నీటిని సరఫరా చేస్తున్నాయి. నీరు నిల్వ చేసే ట్యాంకులను నిర్లక్ష్యంగా వదిలేస్తుండడంతోనే ప్రజలు రోగాల బారిన పడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. రుద్రూర్ మండల కేంద్రంలోని 9 వ వార్డులో గల శ్రీ రామలింగ చౌడేశ్వరి ఆలయం ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరి, పెచ్చులు ఊడిపోయి,...