కూలీలకు 200 రోజుల పని కల్పించాలి
మాక్లూర్, బతుకమ్మ : ఉపాధి హామి కూలీలకు 100 రోజుల పని కాకుండా 200 రోజుల పని కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గం సుజాత అన్నారు. బుధవారం మాక్లూర్ మండలం చిన్నాపూర్ గ్రామంలో ఐద్వా కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఐద్వా ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ చిన్నాపూర్ గ్రామంలో ఉపాధి కూలీలకు టెంట్ సౌకర్యం కల్పించాలన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే కూలీ రేట్లు మాత్రం...