Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2026, 11:58 am Posted by : ramakrishna

హస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మహత్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ఓ  ప్రైవేట్ హస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ధర్మా బాద్ కు చెందిన ఓంకార్ (24) ఖలీల్ వాడి లోని సాయి అశ్విని హస్పిటల్ లో  ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి హస్పిటల్ బాత్రూం లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హస్పిటల్  నిర్వాహకులు పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. యువకుడి ఆత్మహత్య కు కారణాలు తెలియరాలేదు. సదరు హస్పిటల్ పీసీసీ కార్యదర్శికి చెందిందని తెలిసింది.


Lab technician commits suicide in hospital