బాలల గణేష్ మండలి లడ్డును దక్కించుకున్న కురుమసేన యూత్

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అంబం(ఆర్) గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ బాలల గణేష్ మండలి వద్ద ఆదివారం లడ్డు వేలం పాట నిర్వహించారు. గణపతి చేతిలోని లడ్డును 11,001 రూపాయలకు కురుమ సేన యూత్ వారు వేలంలో దక్కించుకున్నారు. అలాగే గణనాథుని మెడలో ఉన్న నోట్ల దండను రామాసని మొనిగా సాయిలు 4,000 రూపాయలకు దక్కించుకున్నారు. అనంతరం గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం ఐదు గంటలకు గణనాథుని శోభయాత్ర ఉంటుందని గణేష్ మండలి కమిటీ సభ్యులు తెలిపారు.