Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2025, 9:09 pm Posted by : ramakrishna

ఆర్మీ జవాన్ ను సన్మానించిన కురుమ సాయిబాబా

ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన క్యాస దేవేందర్ అనే ఆర్మీ జవాన్ ను ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా ఘనంగా సన్మానించారు. కుటుంబ సభ్యులను, స్నేహితులను వదిలి దేశ రక్షణ కోసం అహర్నిశలు సిక్కిం, చైనా బోర్డర్ లో పని చేసి సేవలు విజయవంతం గా ముగించుకొని స్వగ్రామానికి చేరుకున్న సందర్బంగా గ్రామస్తులతో కలిసి,సన్మానించారు. ఈ సందర్బంగా సాయిబాబా మాట్లాడుతూ..దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు (సైనికునికి )నా చేతుల మీదుగా ఈ చిరు సత్కారం చేయడం ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది.దేశ సైనికులకు ఎప్పటికి రుణపడి ఉంటామని భవిష్యత్తులో ఇలాంటి సింధూర విజయాలు సాధించాలని,నా దేశం వైపు కన్నెత్తి చుస్తే శత్రువు గుండెల్లో వణుకు పుట్టాలని భారత త్రివిధ దళలా సత్తా చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఆయనతో పాటు స్థానికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.