సీయంఆర్ ధాన్యం హద్ధుల దాటిస్తున్నది ఎవ్వరు
బాన్సువాడ నియోజకవర్గం లోనే సీయంఆర్ దందా ఎందుకు?
సీయంఆర్ బియ్యం అమ్మకంలో అనాడు బిఆర్ఎస్ అండా నేడు కాంగ్రెస్ ?
నేతలతో అంటకాగితే వేటు తప్పదా?
నిజామాబాద్ జిల్లాలో ఊసేలేనీ సీయంఆర్ రికవరీ
నిజామాబాద్, బతుకమ్మ:
పాలకులు ఎవ్వరైనా, ప్రభుత్వం ఎవ్వరిదైనా పర్వలేదు అంటున్నారు రైస్ మీల్లర్లు. ప్రభుత్వం సీయంఆర్ కోసం మిల్లులకు అప్పగిస్తున్న ధాన్యం మర అడించకుండానే హద్ధులు దాటిస్తున్నారు. రెండు రొజుల క్రితం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని కుర్ల నుంచి ఆంద్రప్రదేశ్ లోని పెద్ధపూరంకు తరలుతున్న ధాన్యం లారీ పట్టుబడింది. సీజన్ కానీ సీజన్ లో వడ్ల లారీ ఎందుకు రాష్ర్ట సరిహద్ధులను దాటుతుంది, దాని వేనుక ఉన్న పెద్ధలు ఎవ్వరు అంటే ఎవ్వరివద్ధ సమాదానం లేదు. లారీ డ్రైవర్ క్లీనర్ వద్ధ ఎలాంటి అధారాలు లేకపోవడంతో దాన్యంతో పాటు లారీని బీర్కూర్ పోలిస్ లకు అప్పగించారు. సంబంధిత ధాన్యం ఎ మిల్లుకు కేటాయించింది, దానిని ఎవ్వరు సరిహద్ధులు దాటిస్తున్నారని పోలిస్ లను ఆరా తీస్తే అది సీవిల్ సప్లై ఎన్ పోర్స్ మెంట్ అధికారులకు తెలుసని చెబుతున్నారు. వందల క్వింటాళ్ల వడ్లు సరిహద్దులు దాటుతుంటే పౌర సరఫరాల శాఖాధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
గత ప్రభుత్వం హయంలో ఒక్క నిజామాబాద్ జిల్లాలో దాదాపు రూ.120 కోట్లు సీయంఆర్ ధాన్యం పక్కదారి పట్టింది. బోదన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ అమేర్ తో పాటు పలువురు మీలర్లను డిపాల్టర్ లుగా ప్రకటించడంతో పాటు కోటగిరి పోలిస్ స్టేషన్ లో క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. రెవెన్యూ రికవరి యాక్టు ప్రయోగించారు. మిల్లుల్లో ధాన్యం లేకున్నా ఉన్నట్లు లెక్కలు చెప్పిన నిజామాబాద్ సివిల్ సప్లయ్ డీఎం, సివిల్ సప్లయ్ ఆఫీసర్ ఇద్దరిని కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెన్షన్ చేసింది. ఇదిలా ఉండగానే ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి జిల్లాలో ఇప్పటికి డిపాల్టర్ ల వద్ధ కోట్ల రూపాయాల దాన్యం మిగిలిపోయింది. ఎఫ్ సీఐ కి ఇవ్వాల్సిన సీయంఆర్ కోసం గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సమీక్షసమావేశం నిర్వహించిన ఎలాంటి ఫలితం లేకుండానే మరోసారి గడువు పెంచారు తప్పితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద పరిశ్రమగా రైసుమిల్లులని చెప్పాలి. గత బీఆర్ఎస్ హయంలో విచ్చలవిడిగా ధాన్యాన్ని కేటాయించుకుని మిల్లర్లు ధాన్యంను మహారాష్ట్ర, కర్ణాటకకు అమ్మేస్తున్నారు. వడ్ల గింజలను మరఆడించకుండానే టన్నులకొద్ది ధాన్యం మాయం అయింది. దాని స్థానంలో రేషన్ దుకాణాలకు సంబంధించిన బియ్యంను ఎఫ్ సిఐకి అప్పజెప్పి మిల్లర్లు సేఫ్ అవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో సీయంఆర్ కోసం సివిల్ సప్లయ్ అధికారులు మిల్లులకు కేటాయించిన ధాన్యం పక్కదారి పడుతున్నా మిల్లర్లపై కేసులు నమోదు మినహా రికవరి లేకపోవడంపై విమర్శలున్నాయి. ఒక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 200 కోట్ల మేర సీఎంఆర్ కుంభకోణం ఉందని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకులు ఏకంగా ఎఫ్ సిఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఎఫ్ సిఐ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించి ధాన్యం లెక్కల్లో తేడాలు ఉండడంతో రికవరికి ఆదేశాలు జారీ చేశారని కానీ ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులతో మిల్లర్లు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే సీఎంఆర్ విషయంలో కఠినంగా వ్యవహరించినట్లు చేశారు కానీ తర్వాత అంతా మనమంతా ఒక్కటే అన్న చందంగా పరిస్థితి మారిపోయింది. డిఫాల్టర్లు, రెవెన్యూ రికవరి యాక్టులు, కేసులు నమోదయిన మిల్లర్లు కాంగ్రెస్ నాయకులను శరుణు కోరడంతో నిజామాబాద్ రూరల్, బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో జరిగిన సీఎంఆర్ కుంభకోణాలు అంతా అటకెక్కాయి. ఇప్పుడు అన్ సీజన్ లో ధాన్యం లారీ ఏకంగా ఆంధ్రకు తరలిపోవడం వెనుక మిల్లర్లకు కాంగ్రెస్ నేతల అభయహస్తం ఉందని చర్చ జరుగుతుంది.
