Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 December 2024, 1:48 pm Posted by : ramakrishna

హైదరాబాద్ కు తరలిన కురమలు

బాన్సువాడ, బతుకమ్మ : హైదరాబాద్ లో నిర్వహిస్తున్న దొడ్డి కొమురయ్య కురుమ సంఘం భవన  ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు బాన్సువాడ నుంచి కురమలు బయల్దేరి వెళ్లారు. రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బలరాజ్, కురుమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గంగారాం, నర్సుగొండ, విఠల్, ఇజాజ్, సురేశ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.