Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2025, 4:35 pm Posted by : ramakrishna

రోడ్డుపై నిరసన తెలిపిన కురగాయల విక్రేతలు

 విక్లీ మార్కేట్ చౌరస్తాలో అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని రస్తారోకో

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలోని విక్లీ మార్కేట్ ( అంగడి బజార్ ) చౌరస్తాలోని కురగాయల విక్రేతలు నిరసనకు దిగారు. తమ కురగాయాలను క్రయ విక్రయాలను చౌరస్తాలో రోడ్డుపై అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని బుదవారం సాయంత్రం రస్తారోకో చేపట్టారు. నగరంలోని  విక్లీ మార్కేట్ చౌరస్తాలో రోడ్డుపై క్రయ విక్రయాల కారణంగా ట్రాఫిక్ జాం అవుతుందని గత కోన్ని రోజులుగా కురగాయాలను డిఎస్ మార్కేట్ లో అమ్ముకోవాలని అధికారులు సూచించారు. ఇదే విషయంను స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కు విన్నవించిన డిఎస్ మార్కేట్ లో అమ్ముకోవాలని ఇంటిగ్రేటేడ్ మార్కేట్  ప్రారంభించిన తరువాత అమ్మకాలకు అనుమతిస్తామని తెల్చి చెప్పారు. దానితో మజ్లీస్ నాయకులతో కలిసి మున్సిపల్ కమీషనర్ ను కలిసిన సానుకులంగా స్పంధించలేదు. దానితో తమకు డిఎస్ మార్కేట్ లో గిరాకీలు లేవని తమకు అక్కడే అనుమతించాలని కురగాయాల అమ్మకం దారులు ( రిటేల్ వ్యాపారులు) నిరసనకు దిగారు.

Kuragaya sellers protested on the road