కుమ్మర శాలివాహన ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కుమ్మర శాలివాహన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంఘానికి సంబంధించిన నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో కుమ్మర కమ్యూనిటీకి చెందిన ఉద్యోగులు పాల్గొని, ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, విద్యా–ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో సేవా, సంక్షేమ కార్యక్రమాలకు కట్టుబడి పనిచేస్తామని సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం...