Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 February 2026, 5:52 pm Posted by : ramakrishna

కుమ్మర శాలివాహన ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

కుమ్మర శాలివాహన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో సంఘానికి సంబంధించిన నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో కుమ్మర కమ్యూనిటీకి చెందిన ఉద్యోగులు పాల్గొని, ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, విద్యా–ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో సేవా, సంక్షేమ కార్యక్రమాలకు కట్టుబడి పనిచేస్తామని సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం అధ్యక్షులుగా డా. వీరప్రసాద్ (రిటైర్డ్ లైబ్రేరియన్), జిల్లా అధ్యక్షులుగా డా. మర్రిపల్లి భూపతి (అసిస్టెంట్ ప్రొఫెసర్, జీడీసీ మోర్తాడ్), వర్కింగ్ ప్రెసిడెంట్గా అవునూరి ప్రమోద్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా బొడ్డుపల్లి నాగేశ్వరరావు, కోశాధికారిగా కుమ్మరి హనుమాన్లు, జిల్లా కన్వీనర్ గా దత్తాత్రేయ, జిల్లా సమన్వయకర్త గా కే. రాజు (సీఆర్‌పీ, సమగ్ర శిక్ష) జిల్లా ఉపాధ్యక్షులు గా కానుగుల జయపాల్, గిరిరాజ్, పోటుగంటి అశోక్, తుడిశెట్టి గంగాధర్, కుమార్ పోశెట్టి, సంయుక్త కార్యదర్శులు గా శ్రీనివాస్, వేణుగోపాల్, డి. రమేష్, సురేష్, లీగల్ అడ్వైజర్ గా విజిగిరి గంగారం, సలహాదారులుగా రైల్వే గంగాధర్, అంకమ్మరావు, మీడియా ఇంచార్జీలు గా తుకారం, కనకయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వినయ్ కుమార్ మరకంటి, కార్యవర్గ సభ్యులుగా గంగాధర్, మధు, లక్ష్మణ్, బాలయ్య, మోహన్, రవి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.