101 మంది మహిళలతో కుంకుమార్చన
మోర్తాడ్, బతుకమ్మ: దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో శనివారం 101 మంది మహిళలతో కుంకుమార్చన కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో దుర్గమ్మను అని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. కార్యక్రమంలో పంతులుప్రవీణ్, భక్తులు బొమ్మ శ్రీనివాస్, నాగచైరన్, పృద్వి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.