దత్త మందిరంలో కుంకుమార్చన

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలోని వినాయక నగర్ లో గల సద్గురు ధామం ధార్మిక సేవా సంస్థ  దత్త మందిరంలో శుక్రవారం అనఘా దేవి  వ్రతం నిర్వహించారు. ఈకార్యక్రమంలో  25 మంది మహిళలు అనఘా దేవి  వ్రతం, కుంకుమార్చన నిర్వహించారు.  11 వ్రతాలు  నిర్వహించిన వారికి వారి మనో భీష్టం నెరవేరుతుందని  ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు  ఇప్పకాయల హరిదాసుస్వామీజీ తెలిపారు. ప్రతి మాసం ఈదేవాలయంలో అనఘా దేవి అష్టోత్తరం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.