బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో శనివారం ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కుంకుమార్చన పూజా ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పురోహితులు ప్రవీణ్ శర్మ, భక్తులు బొమ్మ శ్రీనివాస్, అరవింద్, రాజేందర్, నాగచైరన్, అజిత్, నివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.