Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 September 2024, 7:03 pm Posted by : ramakrishna

వర్ని మార్కెట్ కమిటీ చైర్మెన్ గా కులకర్ణి సురేష్

వర్ని, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కులకర్ణి సురేష్ బాబా నియమితులు అయ్యారు. ఈ మేరకు మార్కెటిం గ్ శాఖ వర్ని వ్యవసాయ మా ర్కెట్ కమిటీ పాలకవర్గంను నియమిస్తు ఉత్తర్వులు జారీ చేసింది. వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా వర్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ ఉపాధ్యక్షులుగా మోస్రా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తిమీర్ కార్ లక్ష్మణ్, డైరెక్టర్ లుగా నిమ్మలపూడి పుల్లాజీ, మెగావత్ సంతోష్, గౌరారం రమేష్ గౌడ్, షేక్ అహ్మద్, వేములపల్లి సుధాకర్ రావు, షేక్ మహబూబ్, పార్వతి ప్రవీణ్, బట్టు నాగయ్య, నర్సడి గళ్ళ లావణ్య, వంగా సాయ గౌడ్, తాళ్లూరి మహేష్, ఓరిక గంగాధర్ లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గన్ని ఏర్పాటుచేసిన మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి , నిజామాబాద్ జిల్లా మాజీ డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు కి కృతజ్ఞతాభినందనలు తెలియ జేశారు.