Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2025, 10:27 am Posted by : ramakrishna

 భారతీయ జనతా పార్టి జిల్లా అధ్యక్షుడిగా కులచారి దినేష్

 

 . . . రెండవ సారి  కమలం పార్టీ పగ్గాలు దినేష్ కే

 నిజామాబాద్, బతుకమ్మ:

 

నిజామాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టి  అధ్యక్షులు గా కులచారీ దినేష్ కుమార్ రెండవ సారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా. కాసం వేంకటేశ్వర్లు ప్రకటన జారీ చేశారు. ఇటివల జరిగిన సంస్థగత ఎన్నికల సంధర్బంగా  నిజామాబాద్ జిల్లా బిజేపి అధ్యక్షులుగా దినేష్ కులచారీ ఓకరే నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం అధ్యక్షులుగా కోనసాగుతున్న కులచారీ దినేష్ బస్వా లక్ష్మి నర్సయ్య తరువాత పార్టి పగ్గాలు చెపట్టారు. గత అసెంబ్లి ఎన్నికలలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి 50 వేలకు పైగా ఓట్లను సాధించారు. రెండవసారి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన దినేష్ తనపై నమ్మకంతో రెండోసారి అధ్యక్షుడిగా ఎంపిక చేసిన పార్టి జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిలతో పాటు నిజామాబాద్ ఎంపి ధర్మపురి అర్వింద్ కుధన్యవాదాలు తెలిపారు.

Kulchari Dinesh as district president of Bharatiya Janata Party